A part of Indiaonline network empowering local businesses

మొదలైయన ఏపి మంత్రివ‌ర్గ సమావేశం

  • SHARE THIS
  • TWEET THIS
  • SHARE THIS
  • COMMENT
  • LOVE THIS 0
Posted by : TeluguMirchi on | May 12,2015

మొదలైయన ఏపి మంత్రివ‌ర్గ సమావేశం

ఏపిలో టూరిజం పాల‌సీ ఖ‌రారు ప్ర‌ధాన అజెండాగా రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం కానుంది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి అందిన మెట్రో రైల్ ప్రాజెక్టు డిపిఆర్ కు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసే అవ‌ కాశం ఉంది. ఏడాది పాల‌న పూర్త‌వుతున్న సంద‌ ర్భంగా ఎన్నిక‌ల హామ‌లు అమ‌లు..కొత్త ఉద్యోగాల క‌ల్ప‌న పై క్యాబినెట్ దృష్టి పెట్ట‌నుంది. రాజ‌ధాని భూ సేక‌ర‌ణ..ఆర్టీసి స‌మ్మె ఈ స‌మావేశంలో కీల‌క అంశాలుగా ఉండ‌నున్నాయి..

ఏపి మంత్రివ‌ర్గ స‌మావేశం మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌ది గంట‌ల‌కు ప్రారంభం అయ్యింది. ఇందులో ప్ర‌ధానం గా నూత‌న టూరిజం పాల‌సీ పై ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఇచ్చిన ముసాయిదాకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయ‌నుంది. ప‌ది వేల కోట్ల పెట్టుబ‌డులు ల‌క్ష్యంగా ఈ పాల‌సీ సిద్ద మైంది. ఏపిలో కొత్త టూరిజం ప్రాజెక్టులకు 21 రోజుల్లోనే అనుమ‌తి ఇవ్వ‌టం..విద్యుత్ ను త‌క్కువ ధ‌ర‌కు అందించేందుకు ప్ర‌త్యేక టారిఫ్ ఖ‌రారు చేయ‌టం వంటివి ఈ పాల‌సీలో పొందు ప‌రిచారు. వాట‌ర్ స్పోర్ట్స్‌,టెలి టూరిజం, ఎకో టూరిజం అభివృద్దితో పాటుగా కొత్త‌గా ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌టం పై కూడా పాల‌సీలో స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఇక‌..ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్స్‌, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ల ఏర్పాటు..ఒకే టిక్కెట్ పై టూరిజం స్ధలాల ప‌ర్య‌ట‌న‌..ప్ర‌త్యేక పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు వంటి వాటి పై క్యాబినెట్ స‌బ్ క‌మిటీ ప్ర‌తిపాదించిన పాల‌సీ పై క్యాబినెట్ చ‌ర్చించి ఆమోద ముద్ర వేయ‌నుంది.

ఇక‌..ఇప్ప‌టికే డిల్లీ మెట్రో రైల్ ద్వారా..విజ‌య‌వాడ‌లో మెట్రో రైల్ డిపిఆర్ ను రాష్ట్ర ప్ర‌భుత్వ మెట్రో స‌ల‌హాదారుడు శ్రీధ‌ర‌న్ అంద‌చేసారు. దీని పై పూర్తి స్ధాయిలో అద్య‌య‌నం కోసం స‌మ‌యం తీసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం దీనిని ఈ మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించ‌నుంది. వియ‌వాడ లో రెం డు కారిడార్ల ఏర్పాటు తో పాటుగా..విజిటియం ప‌రిధిలో రాపిడ్ రైల్ ట్రాన్సిస్ట్ సిస్టం పైనా డిపిఆర్‌లో ప్రతిపాదించారు. దీని కోసం కిలోమీట‌రు 30 రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని అందులో స్ప‌ష్టం చేసారు. దీని పై క్యాబినెట్‌లో చ‌ర్చించి ఆమోద ముద్ర వేసే అవ‌కాశం ఉంది. దీంతో పాటుగా..రాజ‌ధానిలో భూ స‌మీక‌ర‌ణ కు స‌హ‌క‌రించ‌ని ప్రాంతాల్లో భూ సేక‌ర‌ణ‌కు వెళ్లాల‌ని..ఈ నెల 14న నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణ‌యం తీసుకుంది. దీని పై క్యాబినెట్ స‌మావేశంలో తుది నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నెల ఆరో తేదీ నుంచి కొన‌సాగుతు న్న ఆర్టీసి స‌మ్మె పై క్యాబినెట్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌నుంది.

వీటితో పాటుగా..ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల పై స‌మీక్షించే అవ‌కాశం ఉంది. ఇక‌…ఈ స‌మావేశంలో ఉద్యోగాల ఖాళీలు..పెండింగ్ నోటిఫికేష‌న్ల పై అధికారుల నుంచి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స‌మాచారం కోరింది. పూర్తి వివ‌రాలు సేక‌రించి..దీని పై ఒక ప్ర‌ణాళిక సిద్దం చేసే విధంగా నిర్ణ‌యం ఉండ‌వ‌చ్చ‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టుల పురోగ‌తి..నీరు-చెట్టు నిర్వ‌హ‌ణ‌..కొత్త విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం నాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల పై క్యాబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది..

Comments