A part of Indiaonline network empowering local businesses

మే 14న ‘అసుర’ ఆడియో

  • SHARE THIS
  • TWEET THIS
  • SHARE THIS
  • COMMENT
  • LOVE THIS 0
Posted by : TeluguMirchi on | May 12,2015

మే 14న ‘అసుర’ ఆడియో

బాణం’, ‘సోలో, ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నారారోహిత్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘అసుర’. నారా రోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. కృష్ణ విజయ్ దర్శకుడు. శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్ నిర్మాతలు.

ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తే ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల ఈ నెల 14న సినీ , రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరనుంది. యువ మీడియా ఈ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.

నారారోహిత్, ప్రియాబెనర్జీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మధు సింగం పల్లి, రవివర్మ, సత్యదేవ్, భాను, రూపాదేవి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: యస్.వి.విశ్వేశ్వర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్: మురళీ కొండేటి, పాటలు: వశిష్ట శర్మ, కృష్ణకాంత్, సుబ్బరాయశర్మ, డ్యాన్స్: విజయ్, నిర్మాతలు: శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్, రచన-దర్శకత్వం: కృష్ణవిజయ్. 

Comments