A part of Indiaonline network empowering local businesses

ఇప్పుడు ఎన్టీఆర్ వంతు…

  • SHARE THIS
  • TWEET THIS
  • SHARE THIS
  • COMMENT
  • LOVE THIS 0
Posted by : TeluguMirchi on | May 12,2015

ఇప్పుడు ఎన్టీఆర్ వంతు…

అబిమానుల కోసం హీరోలు సినిమాలలోనే కాదు నిజజీవితం లో కూడా వారి కోసం ఏమి చేయడానికి అయిన రెడీ అంటారు. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి పెద్ద స్టార్స్ అబిమానులను కలిసి వారి కోరికలను తీర్చారు. ఈ మద్య నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోన ఓపిరితో కొట్టుకుంటున్న శ్రీజని కలిసి తీరిగి తన ఊపిరి పోసి ఎంతమందికి అదర్శం అయ్యాడు.

ఇప్పుడు అదే జాబితాలో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఅర్ ఒక అభిమాని కోరిక తీర్చి నిజ జీవితం లో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు. శ్రీనిధి అనే ఓ పదేళ్ళ పాప గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రస్తుతం శ్రీనిధి కూకట్‌పల్లిలోని రాందేవ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. క్యాన్సర్ చివరిదశకు చేరిందన్న విషయాన్ని డాక్టర్స్ చెప్పడంతో శ్రీనిధిని రక్షించడానికి హాస్పిటల్ వర్గాలు ఎన్ని విధాలా శ్రమిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మేక్ ఎ విష్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఆ చిన్నారి ఓ కోరికను బయటపెట్టింది. తాను ఎంతగానో ఇష్టపడే హీరో ఎన్టీఆర్‌ను కలవాలి అని ఉందని వెల్లడించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్, ఆ చిన్నారిని కలిసేందుకు ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతం లో రామ్‌దేవ్ హాస్పిటల్‌లో శ్రీనిధిని కలిసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నాడు. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను చూడగానే ఆ పాపా కళ్ళలో ఆనందం కనపడింది.

Comments