A part of Indiaonline network empowering local businesses

ఆ హీరోకు ‘తిక్కరేగింది’…

  • SHARE THIS
  • TWEET THIS
  • SHARE THIS
  • COMMENT
  • LOVE THIS 0
Posted by : TeluguMirchi on | May 12,2015

ఆ హీరోకు ‘తిక్కరేగింది’…

మాస్ మహారాజ్ రవితేజ..ఎప్పటికప్పుడు వెరైటీ కోరుకునే రవితేజ..అదే మాదిరి తన సినిమాల టైటిల్ కూడా వెరైటీ ఉండాలని కోరుకుంటాడు..ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఈ అబ్బాయి చాల మంచోడు , ఖతర్నాక్ , నేనింతే ఇలా ఒక్క సినిమా అనే కాదు చేసి ప్రతి సినిమా టైటిల్ లో ఏదో కొత్తగా ఉండాలని చూస్తుంటాడు.. తాజాగా మరో వెరైటీ టైటిల్ తో మన ముందుకు రాబోతున్నాడు…కందిరీగ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో ‘తిక్కరేగింది’ అనే సినిమా చేయబోతున్నాడు.

వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న రవితేజ ఇప్పుడు తిక్కరేగింది అంటూ పక్క మాస్ కథ తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు జరుగుతున్నయట..ప్రస్తుతం కిక్ చిత్ర ప్రమోషన్ లో బిజీ గా ఉన్న రవి..ఈ చిత్ర విడుదల తర్వాత సంతోష్ తో సినిమా సెట్స్ ఫైకి తీసుకరానున్నాడు.

Comments